Saturday 7 January 2017

స్క్రీనింగ్ పరీక్షలతో కేన్సర్ చెక్



కేన్సర్‌ను ఆదిలోనే గుర్తించడం కన్నా గొప్ప ప్రయోజనం మరొకటి లేదు. ఒకప్పుడైతే, అలా ముందే గుర్తించే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అందుకే కేన్సర్‌ బారిన పడిన ఎంతో మంది అర్థాంతరంగా తమ ప్రాణాలు కోల్పోయారు . అయితే, కేన్సర్‌ను తొలిదశలోనే అంటే లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షించే డైగ్నాసిస్‌ విధానాలు, లక్షణాలు కనిపించకముందే ఆ పరిస్థితుల్ని ముందే గుర్తించే స్ర్కీనింగ్‌ విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

                కేన్సర్‌ను జయించాలంటే కేన్సర్‌ను చాలా ముందుగా గుర్తించాలి. అలా ముందుగా గుర్తించడానికి రెండు మార్గాలు ఉన్నాయి. వాటిలో కేన్సర్‌ మొదలైన తొలిదశలోనే గుర్తించే డైగ్నాసిస్‌ విధానాలు. రెండవది కేన్సర్‌ రాకముందే పరీక్షలు చేసే స్ర్కీనింగ్‌ విధానాలు.ఇందులో భాగంగా కేన్సర్‌ వ్యాధికి సంబంధించిన ముందస్తు హెచ్చరికల గురించిన అవగాహన పెంచుకోవడం, ఒకవేళ ఆ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం. ముందు ఫ్యామిలీ ఫిజిషియన్‌ను సంప్రదించి, అది కేన్సర్‌ అవునో కాదో ఒక నిర్ధారణకు రావడం చాలా ముఖ్యం. లక్షణాలు పదే పదే కనిపిస్తున్నప్పుడు మళ్లీ మళ్లీ పరీక్షలు చేయించుకోవడం అవసరం.

No comments:

Post a Comment